అన్నను చంపిన తమ్ముడు | Man killed after Stir with younger brother | Sakshi
Sakshi News home page

అన్నను చంపిన తమ్ముడు

Jul 19 2015 7:45 PM | Updated on Jul 29 2019 5:43 PM

ఆస్తుల పంపకం దగ్గర గొడవపడి క్షణికావేశంలో అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు.

మహబూబ్‌నగర్(బిజినేపల్లి): ఆస్తుల పంపకం దగ్గర గొడవపడి క్షణికావేశంలో అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లిలో ఆదివారం జరిగింది. వివరాలు..గ్రామానికి చెందిన రైతు చిన్న నిరంజన్, చంద్రమ్మ దంపతులకు ఆంజనేయులు, యాదయ్య, మార్కండేయ ముగ్గురు కొడుకులు ఉన్నారు. తల్లిదండ్రులతోపాటు మార్కండేయ వ్యవసాయ పనులు చూస్తుంటాడు.

ఆంజనేయులు, యాదయ్య హైదరాబాద్‌లో జీవనం సాగిస్తున్నారు. ఆంజనేయులు(24) ఎప్పుడొచ్చినా ఆస్తి విషయంలో తరచూ తల్లిదండ్రులతోపాటు తమ్ముడు మార్కండేయతో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆదివారం మరోమారు గొడవ జరిగింది. మాటామాట పెరిగి చేతికందిన కత్తితో ఆంజనేయులుపై మార్కండేయ దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సరస్వతి ఫిర్యాదుమేరకు ఆంజనేయులి తల్లిదండ్రులు, తమ్ముడు మార్కండేయపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement