breaking news
money disputes
-
అనంతపురం: లోకేష్ పాదయాత్రలో డబ్బుల గోల
-
లోకేష్ యాత్రలో డబ్బుల గోల.. సోషల్ మీడియాలో వైరల్
సాక్షి, అనంతపురం: నారా లోకేష్ యాత్రలో డబ్బుల గొడవ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లోకేష్ పాదయాత్ర లో పాల్గొన్న ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పంపిణీ చేశారు. తమకు 500 రూపాయల చొప్పున ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన హిందూపురం టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. తెలుగు తమ్ముళ్ల రభస సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లోకేష్ పాదయాత్ర కు జన సమీకరణ కోసం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్లు డబ్బు, మద్యం భారీగా పంపిణీ చేశారు. చదవండి: ఏపీ మహిళలకు గుడ్న్యూస్.. 78.94 లక్షల మందికి రూ.6,419 కోట్లు -
అన్నను చంపిన తమ్ముడు
మహబూబ్నగర్(బిజినేపల్లి): ఆస్తుల పంపకం దగ్గర గొడవపడి క్షణికావేశంలో అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్పల్లిలో ఆదివారం జరిగింది. వివరాలు..గ్రామానికి చెందిన రైతు చిన్న నిరంజన్, చంద్రమ్మ దంపతులకు ఆంజనేయులు, యాదయ్య, మార్కండేయ ముగ్గురు కొడుకులు ఉన్నారు. తల్లిదండ్రులతోపాటు మార్కండేయ వ్యవసాయ పనులు చూస్తుంటాడు. ఆంజనేయులు, యాదయ్య హైదరాబాద్లో జీవనం సాగిస్తున్నారు. ఆంజనేయులు(24) ఎప్పుడొచ్చినా ఆస్తి విషయంలో తరచూ తల్లిదండ్రులతోపాటు తమ్ముడు మార్కండేయతో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆదివారం మరోమారు గొడవ జరిగింది. మాటామాట పెరిగి చేతికందిన కత్తితో ఆంజనేయులుపై మార్కండేయ దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సరస్వతి ఫిర్యాదుమేరకు ఆంజనేయులి తల్లిదండ్రులు, తమ్ముడు మార్కండేయపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.