పోలీసులమంటూ వచ్చి చితకబాదారు | man injured in lb nagar | Sakshi
Sakshi News home page

పోలీసులమంటూ వచ్చి చితకబాదారు

Mar 26 2016 1:50 PM | Updated on Oct 8 2018 3:08 PM

ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్‌లో శనివారం ఉదయం ఓ వ్యక్తిపై దాడి జరిగింది.

హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్‌లో శనివారం ఉదయం ఓ వ్యక్తిపై దాడి జరిగింది. కాశయ్య అనే వ్యక్తి ఇంట్లో ఉండగా పోలీసులమంటూ గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. కాశయ్యపై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని సమీపంలోని మెడికేర్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement