ఇన్నోవా ఢీకొనడంతో వ్యక్తి మృతి | Man dies in Road accident | Sakshi
Sakshi News home page

ఇన్నోవా ఢీకొనడంతో వ్యక్తి మృతి

Jul 16 2015 5:52 PM | Updated on Aug 30 2018 3:56 PM

రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని ఇన్నోవా ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

హైదరాబాద్ (కుత్బుల్లాపూర్) : రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని ఇన్నోవా ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన భూమయ్య(60) రోజు వారీ కూలి నిమిత్తం బుధవారం నగర శివారు ప్రాంతమైన కొంపల్లికి వచ్చాడు.

కాగా గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు వచ్చిన భూమయ్య బహిర్భూమి కోసం జాతీయ రహదారి-44ను దాటుతుండగా ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ అతన్ని బాలాజీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలొదిలాడు. ఈ మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement