అఖిల్ మృతదేహం లభ్యం | Macherla Akhil Dead Body Found in Beas River | Sakshi
Sakshi News home page

అఖిల్ మృతదేహం లభ్యం

Jun 20 2014 12:32 AM | Updated on Apr 6 2019 8:49 PM

అఖిల్ మృతదేహం లభ్యం - Sakshi

అఖిల్ మృతదేహం లభ్యం

బియాస్ నదిలో 12రోజుల క్రితం గల్లంతైన మాచర్ల అఖిల్(20) మృతదేహం గురువారం లభ్యమైంది. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రా మానికి చెందిన మాచర్ల అఖిల్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్

 చౌటుప్పల్   :బియాస్ నదిలో 12రోజుల క్రితం గల్లంతైన మాచర్ల అఖిల్(20) మృతదేహం గురువారం లభ్యమైంది. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రా మానికి చెందిన మాచర్ల అఖిల్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్టడీ టూ ర్‌లో భాగంగా ఈ నెల 3న హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. బియాస్ నదిలో గల్లంతైన అఖిల్ మృతదేహం కో సం 12రోజులుగా రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లు గాలిస్తూనే ఉన్నా రు.
 
 గాలింపు చర్యల్లో భాగంగా గురువారం అఖిల్ మృతదేహం లభ్యమైంది. అఖిల్ గల్లంతైన విషయం తెలియగానే, తల్లిదండ్రులు మాచర్ల సుదర్శన్, సబిత దంపతులు హిమాచల్‌ప్రదేశ్ కు తరలివెళ్లారు.  ఇప్పటి వరకు అక్కడే నిరీక్షిస్తున్నారు. కొడుకు కడసారి చూపు దక్కుతుందా, లేదా అన్న ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. గాలిం పు చర్యల్లో భాగంగా మృతదేహం లభ్యం కావడం తో, కడసారి కొడుకును చూసుకొని గుండెలవిసేలా రోదించారు. శుక్రవారం మధ్యాహ్నం కల్లా ప్రత్యేక విమానంలో మృతదేహం హైదరాబాద్‌కు చేరనుం ది. అక్కడి నుంచి స్వగ్రామానికి తరలించనున్నారు. అఖిల్ గల్లంతవడంతో కొయ్యలగూడెంలో విషాదం నెలకొంది.

 

Advertisement
 
Advertisement
Advertisement