breaking news
macherla Akhil
-
అఖిల్ మృతదేహం లభ్యం
చౌటుప్పల్ :బియాస్ నదిలో 12రోజుల క్రితం గల్లంతైన మాచర్ల అఖిల్(20) మృతదేహం గురువారం లభ్యమైంది. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రా మానికి చెందిన మాచర్ల అఖిల్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్టడీ టూ ర్లో భాగంగా ఈ నెల 3న హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. బియాస్ నదిలో గల్లంతైన అఖిల్ మృతదేహం కో సం 12రోజులుగా రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లు గాలిస్తూనే ఉన్నా రు. గాలింపు చర్యల్లో భాగంగా గురువారం అఖిల్ మృతదేహం లభ్యమైంది. అఖిల్ గల్లంతైన విషయం తెలియగానే, తల్లిదండ్రులు మాచర్ల సుదర్శన్, సబిత దంపతులు హిమాచల్‌ప్రదేశ్ కు తరలివెళ్లారు. ఇప్పటి వరకు అక్కడే నిరీక్షిస్తున్నారు. కొడుకు కడసారి చూపు దక్కుతుందా, లేదా అన్న ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. గాలిం పు చర్యల్లో భాగంగా మృతదేహం లభ్యం కావడం తో, కడసారి కొడుకును చూసుకొని గుండెలవిసేలా రోదించారు. శుక్రవారం మధ్యాహ్నం కల్లా ప్రత్యేక విమానంలో మృతదేహం హైదరాబాద్‌కు చేరనుం ది. అక్కడి నుంచి స్వగ్రామానికి తరలించనున్నారు. అఖిల్ గల్లంతవడంతో కొయ్యలగూడెంలో విషాదం నెలకొంది. -
అశీష్, అఖిల్ మృతదేహాలు లభ్యం
మండీ: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతు అయిన విద్యార్థుల్లో మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమైయ్యాయి. మృతులు అశీష్ ముంతా, మాచర్ల అఖిల్‌గా గుర్తించారు. సికింద్రాబాద్ చిలకలగూడ శ్రీనివాసనగర్‌కు చెందిన అశీష్ ముంతా ప్రమాద సమయంలో ఇద్దరు విద్యార్థినులను ఒడ్డుకు చేర్చి, తాను నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడని అతని స్నేహితులు చెప్పారు. ఏడాది కిందట భర్తను కోల్పోయి విచారంలో ఉన్నఅశీష్ తల్లి సత్యవాణి ఈ వార్త విని కన్నీటిపర్యంతమైంది. ఈ ఉదయం వెలికితీసిన మృతదేహం ఎం.శివప్రకాశ్ వర్మదిగా గుర్తించారు. దీంతో ఇప్పటివరకు లభ్యమైన విద్యార్థుల మృతదేహాల సంఖ్య 12కు చేరింది. గల్లంతైన విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.