రేవంత్రెడ్డి విడుదలకు లైన్ క్లియర్ | line clear for Revanth reddy release | Sakshi
Sakshi News home page

రేవంత్రెడ్డి విడుదలకు లైన్ క్లియర్

Jul 1 2015 1:02 PM | Updated on Sep 3 2017 4:41 AM

రేవంత్రెడ్డి విడుదలకు లైన్ క్లియర్

రేవంత్రెడ్డి విడుదలకు లైన్ క్లియర్

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విడుదలకు లైన్ క్లియర్ అయింది. బుధవారం రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు హైకోర్టులో కరెక్షన్ పిటిషన్ దాఖలు చేశారు.

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విడుదలకు రూట్ క్లియర్ అయింది. బెయిల్ ఆర్డర్లో సాంకేతిక లోపాలు ఉండటంతో బుధవారం ఉదయం రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు  హైకోర్టులో కరెక్షన్ పిటిషన్ దాఖలు చేశారు.  పిటిషన్ను విచారించిన హైకోర్టు పూచీకత్తు ఏసీబీ కోర్టులోనే ఇవ్వాలని స్పష్టం చేసింది. తీర్పు కాపీని  హైకోర్టు సవరించింది. మరికాసేపట్లో కాపీ ప్రతి ఏసీబీ కోర్టుకు అందనుంది. దాంతో రేవంత్ రెడ్డి ఇవాళ చర్లపల్లి జైలు నుంచి విడుదల కానున్నారు.

కాగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్టు రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులు ఉదయసింహా, సెబాస్టియన్కు నిన్న బెయిల్ మంజూరు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement