కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి జీవిత ఖైదు

Life Imprisonment For Father By Raping His Daughter In SangaReddy - Sakshi

సాక్షి, సంగారెడ్డి/ వర్గల్‌: కన్న కూతురిపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం సంగారెడ్డి జిల్లా కోర్టులో మొదటి అదనపు జడ్జి పాపిరెడ్డి తీర్పు నిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నెంటూర్‌ గ్రామానికి చెందిన భీమగాళ్ల బాబు (40) కూతుర్తెన 15 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో 2018 అక్టోబర్‌ 12న భర్తపై ముత్తమ్మ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో నేరం రుజువు కావడంతో బాబుకు కోర్టు జీవితఖైదు, జరిమానా విధించింది. ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేసిన ఏసీపీ నారాయణ, తొగుట సీఐ రవీందర్, ఇతర పోలీసులను సిద్దిపేట సీపీ అభినందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top