రాజాపేటలో చిరుత సంచారం | leopard enters in rajapet village at nalgonda district | Sakshi
Sakshi News home page

రాజాపేటలో చిరుత సంచారం

Feb 10 2016 10:32 AM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లా రాజాపేట మండలం చల్లూరు పడమటిగుట్ట సమీపంలో బుధవారం చిరుత సంచరిస్తుందనే వార్త కలకలం రేపింది.

రాజాపేట: నల్లగొండ జిల్లా రాజాపేట మండలం చల్లూరు పడమటిగుట్ట సమీపంలో బుధవారం చిరుత సంచరిస్తుందనే వార్త కలకలం రేపింది. వ్యవసాయ క్షేత్రాల సమీపంలో పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన ఓ రైతు ఆవు దూడ మృతిచెంది ఉండటాన్ని గమనించి గ్రామస్థులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు చిరుత దాడి చేసి ఆవు దూడను చంపిందని నిర్ధరించుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement