భూమి కబ్జా.. దంపతుల ఆత్మహత్యాయత్నం | land tress passes..couple attemped to suicide | Sakshi
Sakshi News home page

భూమి కబ్జా.. దంపతుల ఆత్మహత్యాయత్నం

Feb 9 2015 3:17 PM | Updated on Jul 10 2019 7:55 PM

జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజావాణి సందర్భంగా దంపతులు కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం చేశారు.

మహబూబునగర్ టౌన్: జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజావాణి సందర్భంగా దంపతులు కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన మహబూబునగర్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి సందర్భంగా సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. వనపత్తి మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి, శ్రీరాములు దంపతులు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఏడేళ్ల క్రితం ప్రభుత్వం వీరికి 100 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది.. అయితే, కొంత మంది కబ్జాదారులు ఆ భూమిని కబ్జాచేశారు. దీంతో న్యాయం చేయాలని దంపతులు ప్రజావాణిలో 7సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. ఈ క్రమంలోనే సోమవారం జరిగిన ప్రజావాణిలో వారు ఆత్మహత్యాయత్నం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement