కాంగ్రెస్ పార్టీకి అంతం లేదు: కోమటిరెడ్డి | Komatireddy Venkat Reddy Fires On CM KCR For Not Giving Permission To Satyagraha | Sakshi
Sakshi News home page

ఆరెస్సెస్‌కు ఒక న్యాయం, కాంగ్రెస్‌కు మరో న్యాయమా?

Dec 28 2019 1:39 PM | Updated on Dec 28 2019 1:52 PM

Komatireddy Venkat Reddy Fires On CM KCR For Not Giving Permission To Satyagraha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన ఆవిర్భావ దినోత్సవ సత్యాగ్రహానికి అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆరెస్సెస్‌కు ఒక న్యాయం, కాంగ్రెస్‌కు మరో న్యాయమా? అని అనుమతి ఇవ్వకపోవడంపై ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి అంతం లేదని, కేసీఆర్‌ నియంత పోకడలకు త్వరలోనే స్వస్తి పలుకుతామన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సత్యాగ్రహానికి అనుమతి ఇవ్వకపోడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద వైఖరిని తప్పుబట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీనే టీఆర్‌ఎస్‌ భవన్  ఇచ్చిందనే విషయాన్ని కేసీఆర్‌ మర్చిపోవద్దని అన్నారు. సత్యాగ్రహాన్ని అడ్డుకోవడం కుట్ర అని, కేసీఆర్ మాయమాటలతో ఐదేళ్లు పాలన చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు.

ములుగు జిల్లా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. కేసీఆర్ చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడే అభివృద్ధి జరిగిందని, దేశ ప్రజలను చైతన్యం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని చెప్పుకొచ్చారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్‌ఎస్‌లు ఒక్కటే అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చడం కోసం ఎంఐఎం దేశంలో పలు చోట్ల పోటీ చేస్తుందని, ప్రజలు ఈ విషయాన్ని మర్చిపోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement