అమరవీరుల స్థూపానికి జూన్ 2న శంకుస్థాపన | Kcr announces Smrithivanam and martyr | Sakshi
Sakshi News home page

అమరవీరుల స్థూపానికి జూన్ 2న శంకుస్థాపన

May 3 2016 8:12 PM | Updated on Aug 15 2018 9:30 PM

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల గుర్తుగా భారీ స్మారక స్థూపం నిర్మించి రాష్ట్ర ఆవిర్భావ దినం నాడు ఘన నివాళులు అర్పించాలని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల గుర్తుగా భారీ స్మారక స్థూపం నిర్మించి రాష్ట్ర ఆవిర్భావ దినం రోజున ఘనంగా నివాళులు అర్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సచివాలయానికి సమీపంలో గల 12 ఎకరాల భూమిలో స్మృతివనంతో పాటు స్థూపానికి జూన్ 2న సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

స్మృతి వనంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను అందుబాటులోకి తీసుకువచ్చి సాహిత్య కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement