చేపలు తెస్తానని వెళ్లి... | Individual commits suicide | Sakshi
Sakshi News home page

చేపలు తెస్తానని వెళ్లి...

Oct 26 2015 2:27 PM | Updated on Nov 6 2018 7:56 PM

చేపలు తెస్తానని వెళ్లి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహం లభ్యం అయింది

చేపలు తెస్తానని వెళ్లి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. వరంగల్ జిల్లా మంగపేట మండల కేంద్రానికి చెందిన పూజారి సురేందర్(37) స్థానికంగా ఆటో మొబైల్ షాప్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం చేపలు తీసుకొస్తానని మంగపేట పుష్కర ఘాట్ వద్దకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలింపు ప్రారంభించారు.

సురేందర్ తీసుకెళ్లిన బైక్ ఘాట్ సమీపంలో ఉండటంతో గోదావరిలో పడి ఉంటాడని గాలింపు చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా రంగంలోకి దిగి మరపడవల సాయంతో వెతికారు. కాగా.. ఈ రోజు గోదావరి అవతలి ఒడ్డులో ఉన్న మడుగులో సురేందర్ మృతదేహం లభ్యమైంది .

మృత దేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనారోగ్య కారణాల వల్లే గోదావరి లో దూకి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement