కోతలే! | increase the current cut after april15th | Sakshi
Sakshi News home page

కోతలే!

Apr 14 2014 1:33 AM | Updated on Aug 29 2018 4:16 PM

కరెంట్ కష్టాలు జిల్లా ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

 నల్లగొండ, న్యూస్‌లైన్,కరెంట్ కష్టాలు జిల్లా ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంటలు చేతికొస్తున్న తరుణంలో విద్యుత్ శాఖ ఎడాపెడా కోతలు విధిస్తుండటంతో అన్నదాత రోడ్డెక్కే పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. జిల్లాలో విద్యుత్ వినియోగం తగ్గినా కోతల అమలులో ఎలాంటి మార్పులూ ఉండవని అధికారులు చెబుతున్నారు.

జిల్లాకు నెలవారీగా కేటాయిస్తున్న విద్యుత్‌కంటే తక్కువగానే వాడకం జరుగుతోంది. 220 కేవీ సబ్‌స్టేషన్‌ల పరిధిలో కరెంట్ కోత లను రాష్ట్ర ట్రాన్స్‌కో కార్యాలయంలోని లోడ్ డిస్పాచ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో జిల్లా అధికారుల ప్రమేయం లేకుండానే పై నుంచే కరెంట్ కోతలు అమలవుతున్నాయి. దీంతో  రెతులు, ప్రజల నుంచి ఎదరవుతున్న సమస్యల ను జిల్లా యంత్రాంగం పరిష్కరించలేని స్థితిలో ఉంది.

 132కేవీ సబ్‌స్టేష న్ల పరిధిలోని కోతలను మాత్రమే జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. వీటి పరిధిలో ఏమైనా సమస్యలు వచ్చినా, కోతల విషయంలో ఏ ప్రాంతం నుంచైనా ఫిర్యాదులందినా వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తున్నారు.

 తగ్గిన విద్యుత్ వాడకం ...
 మార్చిలో జిల్లాకు 17.62 మిలియన్ యూనిట్ల విద్యుత్ కేటాయించారు. అయితే గత నెలలో వివిధ రంగాలకు విద్యుత్ వినియోగం భారీగా ఉండడంతో కోటాకు మించి అదనంగా 1.99 మిలియన్ యూనిట్లు వినియోగించారు. అయితే ఈ నెలలో జిల్లాకు 17.62 మిలియన్ యూనిట్ల విద్యుత్ కేటాయించగా ఇప్పటివరకు సరాసరిగా 16.68 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకుంటున్నారు.

 ఇది పై నుంచి కేటాయించిన కోటాకు వినియోగిస్తున్న కరెంట్‌కు 0.97 మిలియన్ యూనిట్లు తక్కువగానే ఉంది. ఆయకట్టు ప్రాంతంలో చాలావరకు వ్యవసాయ పనులు పూర్తయ్యాయి. నాన్ ఆయకట్టు పరిధిలో ఇంకా పూర్తికావాల్సి ఉంది. ఈ నెలాఖరు నాటికి దాదాపు వ్యవసాయ రంగానికి విద్యుత్ వాడకం చాలా వరకు తగ్గుతుంది. అయితే విద్యుత్ వినియోగం తగ్గినా కోతల విషయంలో ఎలాంటి మార్పులూ ఉండవని జిల్లా అధికారులు చెబుతున్నారు.

 15 తర్వాత పెరగనున్న కోతలు..
 పదో తరగతి పరీక్షలు ఈ నెల 15వ తేదీతో పూర్తి కానున్నాయి. పరీక్షలు ఉన్నాయన్న ఉద్దేశంతోనే మున్సిపాలిటీల్లో ప్రస్తుతం రోజుకు నాలుగున్న గంటల పాటు కోతలు అమలు చేస్తున్నారు. పరీక్షలు పూర్తయిన తర్వాత దీన్ని ఆరు గంటలకు పెంచనున్నారు.

 జిల్లా కేంద్రంలో మాత్రమే యధావిధిగానే రోజుకు 4 గంటల పాటు కోతలు అమల్లో ఉంటాయి. ఇక మండల కేంద్రాల్లో ప్రస్తుతం 8 గంటల పాటు కోతలు అమలవుతుండగా, దీనిని 9గంటల వరకు పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement