ఆకట్టుకున్న నీటి విన్యాసాలు | Impressed water stunts | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న నీటి విన్యాసాలు

Apr 15 2016 3:16 AM | Updated on Sep 13 2018 5:11 PM

ఆకట్టుకున్న నీటి విన్యాసాలు - Sakshi

ఆకట్టుకున్న నీటి విన్యాసాలు

అగ్నిప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సందన్న అన్నారు.

 ఆదిలాబాద్ క్రైం : అగ్నిప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సందన్న అన్నారు. గురువారం అగ్నిమాపక శాఖ వారోత్సవాలు జిల్లా కేం ద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా స్థానిక ఫైర్‌స్టేషన్ ఎదుట అమరవీరులకు నివాళులు అర్పించారు. జెండా ఆవిష్కరించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

స్టాల్స్ ఏర్పాటు చేసి అగ్నిమాపక పరికరాల ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట డెమోస్ట్రేషన్ ( నీటీ విన్యాసాలు) నిర్వహించారు. ప్రమాదాలకు సంబంధించిన సూచికలు, జాగ్రత్తలతో కూడిన కరపత్రాలను స్థానికులు అందజేశారు. కార్యక్రమంలో ఏడీఎఫ్‌వో ధర్మ, స్టేషన్ అధికారి అనిల్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement