యోగాతో ఆరోగ్యం | Health With Yoga | Sakshi
Sakshi News home page

యోగాతో ఆరోగ్యం

Jun 21 2016 11:23 PM | Updated on Sep 4 2017 3:02 AM

మండలంలోని బస్వరాజుపల్లి శివారులోని కాకతీయ లాంగ్‌వాల్ ప్రాజెక్ట్‌లో మంగళవారం 21వ అంతర్జాతీయ యోగా

గణపురం : మండలంలోని బస్వరాజుపల్లి శివారులోని  కాకతీయ లాంగ్‌వాల్ ప్రాజెక్ట్‌లో మంగళవారం 21వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 200 మంది కార్మికులు యోగా శిబిరంలో పాల్గొన్నారు. యోగా చేయడం ద్వారా మానసిక పరిస్థితి అదుపులో ఉంటుందని మేనేజర్ రవీంద్రనాధ్ ఠాగూర్  అన్నారు.

 
యోగాతో మానసిక ఉల్లాసం..

రేగొండ : యోగాతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారని సర్పంచ్ సూర మహేందర్ అన్నారు. మంగళవారం మండలంలోని భాగిర్థిపేట, మడ్తపల్లి, రంగయ్యపల్లె,ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో యోగా దినోత్సవం సందర్భంగా యోగా శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో  యోగా మండల శాఖ అధ్యక్షుడు సూర రాఘవులు, మడ్తపల్లి హెచ్‌ఎం మాధవి, రంగయ్యపల్లె హెచ్‌ఎం టి. నిర్మల, భాగిర్థిపేట హెచ్‌ఎం వెంకన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 
చిట్యాలలో..

చిట్యాల : యోగా సాధన ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని చిట్యాల హైస్కూల్ హెచ్‌ఎం శివరాంబట్ల రమేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరగంటి రవిందర్, కొగిల సుధాకర్, నల్లబెల్లి శ్రీనివాస్, ఓదెల నరేందర్, రాజేంద్రప్రసాద్, కుమార్, రఘుపతి, హాజీనూరాని, అనురాధ, కార్తీక్ ,విద్యార్థులు పాల్గొన్నారు.

 
శాయంపేటలో..

శాయంపేట: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని మండలంలోని పెద్దకోడెపాక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బద్దం సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు మండలకేంద్రంలోని న వోదయ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు యోగా నిర్వహించారు. కార్యక్రమంలో నవోదయ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ మామిడి శరత్, పెద్దకోడెపాక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, రంగారెడ్డి, సదానందం, సదయ్య, రాజేశ్, మొగిలి, బాపురావు,రాజు, కిషన్, సుధాకర్, కుమారస్వామి, సతీష్‌కుమార్, సీర్పీ వంశీ తదితరులు పాల్గొన్నారు.

 
కోల్‌బెల్ట్‌లో..

కోల్‌బెల్ట్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి ఏరియాలో సింగరేణి సీఎండి ఎన్ శ్రీధర్ ఆదేశాలతో గనులు, డిపార్ట్‌మెంట్లలో యోగా డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఏరియాలోని కేటీకే 1వ గని ఆవరణలో మంగళవారం ఉదయం రెస్ట్‌హాల్‌లో కార్మికులు యోగాను అభ్యసించారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ పాలకుర్తి సత్తయ్య ముఖ్య అతిధిగా పాల్గొని యోగా విశిష్టతపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి గని మేనేజర్ ఎంవి నర్సింహరావు అధ్యక్షత వహించగా గ్రూపు ఏజంట్ బళ్లారి శ్రీనివాసరావు, పర్సనల్ మేనేజర్ రేవు సీతారాం తదితరులు పాల్గొన్నారు.

 
యోగా విశిష్టతను తెలుపుతూ ర్యాలీ..

యోగా విశిష్టతను తెలుపుతూ సింగరేణి యాజమాన్యం ఆద్వర్యంలో భూపాలపల్లి కోల్‌బెల్ట్ ప్రాంతంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం సయ్యద్ హభీబ్ హుస్సేన్, పర్సనల్ మేనేజర్ రేవు సీతారాం, గ్రూప్ ఆఫ్ ఏజంట్ బళ్లారి శ్రీనివాసరావు, పలు గనుల మేనేజర్‌లు, హెడ్ డిపార్ట్‌మెంట్లకు చెందిన అధికారులు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్యాంసుందర్, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్, తిరుపతి, గుర్తింపు సంఘం నాయకులు ఏబూసి ఆగయ్య, బడితెల సమ్మయ్య, మిర్యాల బక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement