లీకేజీకి ప్రభుత్వానిదే బాధ్యత: సీపీఎం | Government responsible for the emcet leak:CPM | Sakshi
Sakshi News home page

లీకేజీకి ప్రభుత్వానిదే బాధ్యత: సీపీఎం

Jul 29 2016 3:40 AM | Updated on Aug 13 2018 8:12 PM

ఎంసెట్-2 పేపర్ లీకేజీకి రాష్ర్ట ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది.

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకేజీకి రాష్ర్ట ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలతో చర్చించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో కోరారు. లీకేజీలో అధికారుల హస్తమున్నట్లు సీఐడీ ప్రాథమిక విచారణలో తేలినా, ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న పెద్దలకు కూడా దీనిలో భాగముందనే అనుమానాలు బలంగా ఉన్నాయన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement