రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం | Government reason for farmers suicides | Sakshi
Sakshi News home page

రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం

Aug 21 2015 12:15 AM | Updated on Mar 29 2019 5:32 PM

రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం - Sakshi

రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా రైతు ఆత్మహత్యలు ఏ మాత్రం తగ్గలేదని, వాటన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధికారప్రతినిధి రఘునందన్‌రావు పేర్కొన్నారు...

దౌల్తాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా రైతు ఆత్మహత్యలు ఏ మాత్రం తగ్గలేదని, వాటన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధికారప్రతినిధి రఘునందన్‌రావు పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లి గ్రామంలో అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు నారెడ్డి రాంరెడ్డి కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే  కరువు మండలాలను గుర్తించాలని  డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు కుమ్మరి నర్సింలు, భిక్షపతి, యాదగిరి తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement