‘ఓటు’పై వినూత్న ప్రచారం | Give Different Awareness On Elections Voting | Sakshi
Sakshi News home page

‘ఓటు’పై వినూత్న ప్రచారం

Nov 26 2018 4:19 PM | Updated on Nov 26 2018 4:20 PM

Give Different Awareness On Elections Voting - Sakshi

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

 సాక్షి, నిజామాబాద్: ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేలా వారిని చైతన్యవంతం చేసేందుకు ఎన్నికల అధికారులు వినూత్న ప్రచారం చేపట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్, పోలీసు కమిషనర్, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు ఎలా వేయాలనే అంశాలపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈవీఎం, వీవీప్యాడ్‌ల ద్వారా ఓటు ఎలా ఉపయోగించుకోవాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అదే విధంగా పోలీసు కమిషరేట్‌ పరిధిలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి సంబంధిత ఏసీపీ, సీపీ, సీఐ, ఎస్సై, ఎస్‌బీ వాట్సాప్, డయల్‌ 100 నంబర్లతో ఫ్లెక్సీ ద్వారా ఏర్పాటు చేశారు. కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఐ విల్‌ ఓటు బికాస్‌ ఐ లవ్‌ నిజామాబాద్‌ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇలా ఓటు హక్కును వినియోగంపై చేపట్టిన ప్రచార ఫ్లెక్సీలు ప్రజలను ఆకర్శిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement