శవమై తేలిన అదృశ్యమైన విద్యార్థిని | girl student went missing, dead body found at girls hostel | Sakshi
Sakshi News home page

శవమై తేలిన అదృశ్యమైన విద్యార్థిని

Nov 11 2014 7:41 AM | Updated on Apr 3 2019 5:32 PM

తిరుమలాయపాలెం ఎస్సీ బాలికల హాస్టల్లో ఓ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతిచెందింది.

ఖమ్మం : జిల్లాలోని తిరుమలాయపాలెం ఎస్సీ బాలికల హాస్టల్లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే బానోత్ శిల్ప అనే విద్యార్థిని ఎస్సీ బాలికల హాస్టల్లో చదువుతోంది. గత కొద్దిరోజుల క్రితం శిల్ప హాస్టల్ నుంచి అదృశ్యమైంది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆమె మృతదేహం హాస్టల్ లభ్యమైంది. దీంతో శిల్ప మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement