మిఠాయి షాపునకు రూ.50 వేల జరిమానా

GHMC Challan to Sweet Shop in Hyderabad - Sakshi

ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించినందుకు

ముషీరాబాద్‌: 50 మైక్రాన్ల కన్నా తక్కువ గల ప్లాస్టిక్‌ కవర్లను ఉపయోగిస్తున్న రాంనగర్‌ క్రాస్‌రోడ్డులోని బాలాజీ పాపాలాల్‌ మిఠాయి దుకాణం యాజమానికి జీహెచ్‌ఎంసీ అధికారులు రూ.50 వేల జరిమానా విధించారు. గురువారం జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–15 డీఎంసీ ఉమాప్రకాష్, ఏఎంవోహెచ్‌ భార్గవనారాయణలతో పాటు సిబ్బంది రాంనగర్‌ చౌరస్తాలో తనిఖీలు నిర్వహించారు. బాలాజీ పాపాలాల్‌ మిఠాయి బండార్‌ యజమాని తాత్కాలిక ట్రేడ్‌ లైసెస్స్‌తో దుకాణం నిర్వహిస్తున్నాడు. దీనికితోడు స్వీట్లు తయారు చేసే వంటశాల అపరిశుభ్రంగా ఉండడం, 50 మైక్రాన్ల కంటే తక్కువున్న ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించడంతో జరిమానా విధించా రు. చిన్న దుకాణాల్లోనూ దాడులు నిర్వహించి రూ.3వేల వరకు జరిమానా వేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top