‘వర్గీకరణ’ రాజకీయ అంశమైంది | gaddar speaks on sc bifurcation | Sakshi
Sakshi News home page

‘వర్గీకరణ’ రాజకీయ అంశమైంది: గద్దర్‌

Nov 7 2017 12:27 PM | Updated on Sep 15 2018 2:43 PM

ఎస్సీ వర్గీకరణ అనేది రాజకీయ అంశంగా మారిందని ప్రజా గాయకుడు గద్దర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణ అనేది రాజకీయ అంశంగా మారిందని ప్రజా గాయకుడు గద్దర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడి సందర్భంగా భారతి అనే ఎమ్మార్పీఎస్‌ కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో ఉన్న ఆమె మృతదేహాన్ని గద్దర్‌ మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతి కుటుంబీకులకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, అఖిలపక్షానికి కార్యరూపం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. ఆర్టికల్‌ 341-డి కింద ఎస్సీ వర్గీకరణకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement