కాంగ్రెస్‌కు అవినీతిపై మాట్లాడే హక్కు లేదు | g.kishan reddy fired on congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు అవినీతిపై మాట్లాడే హక్కు లేదు

Feb 3 2017 1:55 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌కు అవినీతిపై మాట్లాడే హక్కు లేదు - Sakshi

కాంగ్రెస్‌కు అవినీతిపై మాట్లాడే హక్కు లేదు

దేశంలో ఆర్థిక సంస్కరణలు అమ లుచేసే దిశలో కేంద్ర బడ్జెట్‌ ఉందని బీజే ఎల్పీ నేత జి.కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఆర్థిక సంస్కరణలు అమ లుచేసే దిశలో కేంద్ర బడ్జెట్‌ ఉందని బీజే ఎల్పీ నేత జి.కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. జనరంజకమైన ఈ బడ్జెట్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై కేంద్రం సాహసోపేత నిర్ణయం తీసుకుందన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతలకు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం అవినీతి నిర్మూలన కోసం చేపడుతున్న చర్యలకు కాంగ్రెస్‌ నాయకులు సహకరించాలని లేదా ఏమీ మాట్లాడకుండా ఉండాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement