ప్రోత్సాహకం ఏదీ! | Funds Granted In the Rulers ignored | Sakshi
Sakshi News home page

ప్రోత్సాహకం ఏదీ!

Mar 3 2015 4:29 AM | Updated on Sep 2 2017 10:11 PM

ప్రోత్సాహకం ఏదీ!

ప్రోత్సాహకం ఏదీ!

శ్రావణ్, సౌమ్య పెద్దలను ఎదిరించి, కట్టుబాట్లను వదులుకుని కులాం తర వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

‘ఆదర్శ దంపతుల’కు మొండిచెయ్యి
నిధుల మంజూరులో పాలకుల నిర్లక్ష్యం
ఏళ్ల తరబడి 90 జంటల ఎదురు చూపులు
బీసీ సంక్షేమ శాఖలో పెరిగిపోయిన దరఖాస్తులు
ఉన్నతాధికారులకు నివేదించినా ఫలితం లేదు

ఇందూరు : శ్రావణ్, సౌమ్య పెద్దలను ఎదిరిం చి, కట్టుబాట్లను వదులుకుని కులాం తర వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహక బహుమ  తి కోసం 2009లో బీసీ సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకున్నా రు. ప్రస్తుతం ఆ దంపతులకు సంతానం కలిగి అమ్మా, నాన్నలయ్యారు. పుట్టిన పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. నేడో రేపో స్కూల్‌కు కూడా వెళ్లే వయస్సు కూడా వచ్చేస్తోంది. నే  టి వరకూ ఆ దంపతులకు ప్రభుత్వం నుంచి కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేయలేదు. వచ్చే రూ. పదివేలు ఆసరాగా ఉం టాయనుకున్న ఆ దంపతులు నిధుల కోసం జిల్లా బీసీ సంక్షేమ శాఖ చుట్టూ తిరిగిన సంద ర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని ఈ ఒక్క జంటే కాదు. ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకున్న 90 జంటలూ ఎదుర్కొంటున్నాయి.
 
అరకొర విదిలింపులు

కులాంతర వివాహాలు చేసుకున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కుల, మత భేదాలు లేకుండా ఆదర్శ వివాహా లు చేసుకున్న దంపతులకు నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అమలులో మాత్రం పూర్తిగా విఫలమైంది. దీంతో ఆ జంటల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యంగా బీసీల పరిస్థితి దారుణంగా ఉంది. ఆదర్శ వివాహాలు చేసుకున్న దంపతులు ప్రభుత్వం అందిం   చే పోత్సాహక బహుమతి కోసం 2009లో జిల్లా బీసీ సంక్షేమ శాఖలో దరఖాస్తులు చేసుకున్నా ఇప్పటి వరకూ అందలేందటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. నిధులు  ఇస్తున్నాం అన్నట్లుగా సంవత్సరానికి రూ.20 వేలు మంజూరు చేస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. ఈ నిధులు కేవలం రెండు జంటలకు మాత్రమే సరిపోతారుు. మిగతా జంటలకు నిరాశే మిగులుతోంది.
 
ఏటా పెరుగుతున్న అర్జీలు
ఏటా బీసీ సంక్షేమ శాఖకు 20 నుంచి 30 దరఖాస్తులు అందుతున్నాయి. సంవత్సరానికి రెండు జంటలకు సరిపోయే నిధులివ్వడంతో తదుపరి దంపతులు సంవత్స రాల తరబడి వేచి చూడటం తప్పడం లేదు. జిల్లాలో 2009 నుంచి నేటి వరకూ కలిపి మొత్తం 90 జంటలు దరఖాస్తులు చేసుకున్నాయి. నిధులు వస్తే దేనికైనా ఉపయో గపడుతాయనే ఉద్దేశంతో బీసీ సంక్షేమ శాఖ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సమాధానాలు చెప్పలేని అధికారులు నిధులు వస్తే సమాచారం ఇస్తాం అని విసుక్కుం టున్నారు. 2012-13 సంవత్సరానికిగాను ప్రభుత్వం రూ.40 వేలను జిల్లాకు మంజూరు చేయగా, వాటిని సీనియార్టీ ప్రకారం ఉన్న నాలుగు జంటలకు అందజేశారు.

ప్రస్తుతం రూ.80 లక్షలు అవసరం. ఈ నిధులను విడుదల చేయాలని గత రెండు, మూడు సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను లేఖల ద్వా రా కోరినా ఫలితం కనబడలేదు. గత నెలలో జిల్లా పరిషత్ స్థాయి సంఘా సమావేశాలలో సైతం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. బీసీ సంక్షేమ శాఖల దరఖాస్తులు కుప్పలుగా పడి ఉంటున్నాయే తప్పా పరిష్కారం లభించడం లేదు. పెళ్లి చేసుకున్న ఇద్దరు కాస్త సంతానంతో ముగ్గురు, నలుగురిగా మారినా ప్రభుత్వం నుంచి పా రితోషకం అందకపోవడం శోచనీయకరమైన విషయమని బాధిత జంటలు వాపోతున్నారుు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలోనైనా తమకు అందాల్సిన ప్రోత్సహకం అందిస్తే సంతోసిస్తామంటున్నారు.
 
నిధుల కోసం వేచి చూస్తున్నాం
కులాంతర వివాహాలు చేసుకున్న బీసీ జంటలకు చాలా సంవత్సరాలు గా ప్రభుత్వం నుంచి నగదు ప్రోత్సహకం అందటం లేదు. ప్రభుత్వం ఏ టా రూ.20వేలు మాత్ర మే మంజూరు చేస్తోంది. అవి ఇద్దరికి మాత్ర మే సరిపోతున్నాయి. మిగతా వారికి అన్యాయం జరగుతోంది. దరఖాస్తుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. అ యితే, 90 జంట లకు రావాల్సిన నిధుల కోసం ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు, జి ల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులకు చాలాసార్లు విన్నవించాం. చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేశాం. చివరికి ప్రతీ నెలా హైదరాబాద్‌లో జరుగుతున్న ఉన్నతాధికారులు సమీక్షలో కూడా విషయాన్ని తెలుపుతున్నాం.
 -విమలాదేవి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement