బస్సును ఢీ కొన్న తుఫాన్ | four injured in an accident | Sakshi
Sakshi News home page

బస్సును ఢీ కొన్న తుఫాన్

Mar 1 2015 5:23 PM | Updated on Sep 2 2017 10:08 PM

వేగంగా వెళ్తున్న తుఫాన్ వాహనం ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మహబూబ్ నగర్: వేగంగా వెళ్తున్న తుఫాన్ వాహనం ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా గోసాపేట మండలం నర్సింగాయపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు..పెద్దకొత్తలో ఉన్న మైసమ్మను దర్శించుకొని వస్తున్న తుఫాన్ వాహనం నర్సింగాయపల్లి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో కొత్తకోట మండలానికి చెందిన ముగ్గురికి, వనపర్తి పట్టణానికి చెందిన ఒకరికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement