breaking news
mysamma temple
-
ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు
మహబూబ్నగర్: సంతకు వెళ్లి వస్తున్న ఆటో బోల్తాపడి 10 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జిల్లాలోని కొస్గి మండలంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వివరాలు.. వివరాలు దౌల్తాబాద్ మండలం యాంకి, గోకఫసల్వాద్, దేశాయపల్లి, లక్ష్మీపల్లి గ్రామాలకు చెందిన 14 మంది కోస్గి వారంతపు సంతకు వచ్చి ఏపీ 22వై 2883 నెంబరు గల యాంకి గ్రామానికి చెందిన ఆటోలో వారి వారి స్వగ్రామాలకు బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని మైసమ్మ ఆలయం దగ్గర ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న పకీరమ్మ, అంజిలమ్మ, నర్సమ్మ, అనసూజ, చెన్నమ్మ, భీమమ్మ, సుజాతతోపాటు ఆటో డ్రైవర్ మౌలానాకు గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న భీమప్ప, కాశమ్మలను 108లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
బస్సును ఢీ కొన్న తుఫాన్
మహబూబ్ నగర్: వేగంగా వెళ్తున్న తుఫాన్ వాహనం ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా గోసాపేట మండలం నర్సింగాయపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు..పెద్దకొత్తలో ఉన్న మైసమ్మను దర్శించుకొని వస్తున్న తుఫాన్ వాహనం నర్సింగాయపల్లి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో కొత్తకోట మండలానికి చెందిన ముగ్గురికి, వనపర్తి పట్టణానికి చెందిన ఒకరికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.