దైవ దర్శనానికి షిరిడీ వెళ్లి.. | five nalgonda People were killed in road accident in Shirdi | Sakshi
Sakshi News home page

దైవ దర్శనానికి షిరిడీ వెళ్లి..

Jun 5 2017 9:17 AM | Updated on Aug 30 2018 4:10 PM

దైవ దర్శనానికి షిరిడీ వెళ్లి.. - Sakshi

దైవ దర్శనానికి షిరిడీ వెళ్లి..

దైవ దర్శనం కోసం షిరిడీ వెళ్లిన వారికి మృత్యువు లారీ రూపంలో ఎదురొచ్చింది

నల్లగొండ: దైవ దర్శనం కోసం షిరిడీ వెళ్లిన వారికి మృత్యువు లారీ రూపంలో ఎదురొచ్చింది. మరి కొద్ది క్షణాల్లో సాయి సన్నిధిలో ఉంటామనగా.. వేగంగా దూసుకొచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

వివరాలు.. జిల్లాకేంద్రంతో పాటు నిడమనూరు, మర్రిగూడకు చెందిన మూడు కుటుంబాలకు చెందిన 15మంది షిరిడీ సాయి దర్శనానికి రైళ్లో బయలుదేరారు. ఆదివారం రాత్రి షిరిడీ రైల్వే స్టేషన్‌లో దిగిన వారు ఆలయానికి వెళ్లడం కోసం ఓ ఆటో ఎక్కారు. మరికొద్దిసేపట్లో గమ్యాన్ని చేరుకుంటామనాగా.. ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మర్రిగూడ లెంకలపల్లికి చెందిన మంగమ్మ(55), నల్లగొండ వెలుగుపల్లికి చెందిన పగిల్ల వెంకటమ్మ(55), వెకటయ్య(58)లతో పాటు మరో ఇద్దరు మృతిచెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement