కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం | fire accident in chemical factory | Sakshi
Sakshi News home page

కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

Jul 16 2016 9:14 AM | Updated on Sep 5 2018 9:47 PM

నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దండుమాల్కాపురంలోని జయ కెమికల్ ఫ్యాక్టరీ స్టోర్‌రూంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

నల్లగొండ : నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దండుమాల్కాపురంలోని జయ కెమికల్ ఫ్యాక్టరీ స్టోర్‌రూంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని స్టోర్ రూంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ అగ్నిప్రమాదంలో స్టోరు రూం సమీపంలో ఉన్న డీసీఎం వ్యాను పూర్తిగా కాలిపోయింది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ఈ ప్రమాదానికి గల కారణంపై భద్రత సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement