రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం నాదర్‌గుల్‌లో సోమవారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి.
నాదర్‌గుల్‌లో ఉద్రిక్త పరిస్థితులు
Jan 11 2016 1:40 PM | Updated on Oct 1 2018 2:09 PM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం నాదర్‌గుల్‌లో సోమవారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం తలపెట్టిన హార్డ్‌వేర్ పార్క్ ఏర్పాటు కోసం భూములను స్వాధీనం చేసుకునేందుకు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఐఐసీ) అధికారులు వచ్చారు. అయితే అధికారులను రైతులు అడ్డుకున్నారు. తమను చంపిన తర్వాతే భూములు తీసుకోవాలంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
Advertisement


