రోడ్డు ప్రమాదంలో రైతు మృతి | Farmer killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

Apr 14 2017 8:06 AM | Updated on Aug 30 2018 4:10 PM

వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్తున్న రైతు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

కొత్తకోట(వనపర్తి): వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్తున్న రైతు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వస్తున్న కారు అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జిల్లాలోని కొత్తకోట మండలం అమడబాకుల వద్ద 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
 
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తి పెద్దమందడి మండలం వెల్టూర్‌ గ్రామానికి చెందిన వెంకట్రాములు(50)గా గుర్తించారు. 

Advertisement
 
Advertisement
Advertisement