breaking news
venkatramudu
-
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
కొత్తకోట(వనపర్తి): వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్తున్న రైతు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వస్తున్న కారు అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జిల్లాలోని కొత్తకోట మండలం అమడబాకుల వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తి పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన వెంకట్రాములు(50)గా గుర్తించారు. -
బలిజలకు న్యాయం చేయకపోతే ఉద్యమమే
అనంతపురం న్యూటౌన్ : బలిజలను బీసీ జాబితాలో చేరుస్తామని వాగ్ధానం చేసి విస్మరిస్తున్న ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాయలసీమ బలిజ మహా సంఘం అధ్యక్షుడు వెంకట్రాముడు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా పర్యటనకొచ్చిన దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి మాణిక్యలరావును కలిసిన బలిజ సంఘం నేతలు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన కాపు కార్పొరేషన్ అభాసుపాలవుతోందని, కాపుల సంక్షేమానికి రూ. 1000 కోట్లు కేటాయించామని చెప్పుకుంటున్న పెద్దలు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. బలిజల సహనాన్ని పరీక్షిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.