బలిజలకు న్యాయం చేయకపోతే ఉద్యమమే | balija venkatramudu pressmeet | Sakshi
Sakshi News home page

బలిజలకు న్యాయం చేయకపోతే ఉద్యమమే

Mar 27 2017 12:22 AM | Updated on Sep 5 2017 7:09 AM

బలిజలను బీసీ జాబితాలో చేరుస్తామని వాగ్ధానం చేసి విస్మరిస్తున్న ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాయలసీమ బలిజ మహా సంఘం అధ్యక్షుడు వెంకట్రాముడు డిమాండ్‌ చేశారు.

అనంతపురం న్యూటౌన్‌ : బలిజలను బీసీ జాబితాలో చేరుస్తామని వాగ్ధానం చేసి విస్మరిస్తున్న ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాయలసీమ బలిజ మహా సంఘం అధ్యక్షుడు వెంకట్రాముడు డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా పర్యటనకొచ్చిన దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి మాణిక్యలరావును కలిసిన బలిజ సంఘం నేతలు తమ డిమాండ్లతో కూడిన  వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన కాపు కార్పొరేషన్‌ అభాసుపాలవుతోందని, కాపుల సంక్షేమానికి  రూ. 1000 కోట్లు కేటాయించామని చెప్పుకుంటున్న పెద్దలు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. బలిజల సహనాన్ని పరీక్షిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement