
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం (జులై16) మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరలు, అక్రమ అరెస్టులు, తన పర్యటనలపై ఆంక్షలు సహా తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.