ఎక్సలెంట్‌ కలెక్టర్‌   | Excellent Award To Collector | Sakshi
Sakshi News home page

ఎక్సలెంట్‌ కలెక్టర్‌  

Aug 15 2018 10:03 AM | Updated on Aug 15 2018 10:03 AM

Excellent  Award To Collector - Sakshi

సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి

సిద్దిపేటటౌన్‌ : సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అందించే రాష్ట్ర ఎక్సలెన్స్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఐఏఎస్‌ అధికారుల కేటగిరీలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా గోల్కొండ కోటలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో అవార్డుతో పాటు రూ.5 లక్షల క్యాష్‌ సర్టిఫికెట్‌ అందుకోనున్నారు. జిల్లాలో చేపడుతున్న రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల నిర్మాణం, హరితహారం, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలలో మంచి పనితీరు కనబర్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర ఎక్సలెన్స్‌ అవార్డుతో సత్కరించనుంది.

అవార్డు లభించిన సందర్భంగా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని జేసీ, డీఆర్వో, ఆర్డీవోలు, తహసీల్దార్‌లు, మండల అధికారుల, రెవెన్యూ సిబ్బంది, జిల్లా అధికారుల సమిష్టి కృషి ఫలితంగానే తనికీ అవార్డు లభించిందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా అభివృద్ధి పథంలో నడిచేలా పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, అభివృద్ధిలో తనను భాగస్వామ్యం చేయడం పట్ల సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement