మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో.. గర్భం దాల్చింది | Old Woman Pregnancy In Siddipet District | Sakshi
Sakshi News home page

మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో.. గర్భం దాల్చింది

Apr 27 2026 11:40 AM | Updated on Apr 27 2026 2:07 PM

Old Woman Pregnancy In Siddipet District

సిద్దిపేట జిల్లా: శిశువు మరణానికి కారణమైన దంపతులతో పాటు వారికి సహకరించిన ఆర్‌ఎంపీని రిమాండ్‌కు పంపించారు. శనివారం హుస్నాబాద్‌ ఏసీపీ సదానందం, సీఐ శ్రీను కేసు వివరాలు వెల్లడించారు. 2025, జులై 29న మండల పరిధిలోని కేశనాయక్‌ తండా శివారులోని వాగులో గుర్తు తెలియని పసికందు శవం నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిందని పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్కన్నపేట ఎస్‌ఐ సీహెచ్‌ ప్రశాంత్, హుస్నాబాద్‌ సీఐ శ్రీను విచారణ చేపట్టారు. 

తండాకు చెందిన బానోతు లక్ష్మికి లేటు వయస్సులో ప్రెగ్నెన్సీ రాగా అప్పటికే ఆమె కూతుర్లకు పెళ్లి కావడంతో విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందనే భయంతో దంపతులు ఎవరికి తెలియకుండా అబార్షన్‌ చేసుకోవాలనుకున్నారు. అయితే కుందానవానిపల్లికి చెందిన ఆర్‌ఎంపీ వంశీ సహకారంతో అబార్షన్‌ టాబ్లెట్స్‌ వేసుకోగా బతికి ఉన్న శిశువు జన్మించింది. 

కాగా గ్రామంలో తెలిస్తే పరువుపోతుందనే భయంతో శిశువును ఎవరికి తెలియకుండా రహస్యంగా చంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారి ఇంటి సమీపంలోని కాలువలో పడేయగా శిశువు నీటి ప్రవాహంలో మునిగి చనిపోయినట్టు విచారణలో నిర్దారణ అయిందని తెలిపారు. ఈ కేసులో చనిపోయిన శిశువు మరణానికి కారణమైన తల్లిదండ్రులు బానోతు లక్ష్మి, రాజు, ఆర్‌ఎంపీ వంశీలను అరెస్ట్‌ చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement