రెచ్చిపోయిన పిచ్చికుక్క | 15 Injured In Stray Dog Attack In Siddipet District | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన పిచ్చికుక్క

Mar 21 2026 5:00 AM | Updated on Mar 21 2026 5:00 AM

15 Injured In Stray Dog Attack In Siddipet District

15 మందికి తీవ్ర గాయాలు

దుబ్బాక: పిచ్చికుక్క దాడిలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. పట్టణంలోని 16వ వార్డులో పోలీస్‌స్టేషన్‌ సమీపంలో పిచ్చికుక్క కనిపించిన వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. పిచ్చికుక్క దాడిలో 15 మంది గాయపడ్డారు. కాగా వీరిలో పర్స బాలయ్యకు తీవ్రగాయాలు కావడంతో సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు.

మిగతా 14 మంది దుబ్బాక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చికుక్క కనిపించిన వారందరిపై దాడి చేసి.. కరవడంతో తీవ్ర రక్త స్రావాలయ్యాయి. పట్టణంలోని 16 వార్డుకు చెందిన 12 మంది, 1, 20 వార్డులకు చెందిన ముగ్గురిపై దాడి చేసింది. అనంతరం ప్రజలు పిచ్చికుక్కను చంపారు. కౌన్సిలర్‌ రాజు, నాయకులు శ్రీరాం రవీందర్, సాయితేజగౌడ్‌ గాయపడిన వారికి చికిత్స చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement