గూడెంలో కిక్కిరిసిన గోదావరి తీరం | devotees rush due to kartika pournami | Sakshi
Sakshi News home page

గూడెంలో కిక్కిరిసిన గోదావరి తీరం

Nov 25 2015 11:48 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెంలో గోదావరి తీరం భక్తజనంతో పోటెత్తింది.

దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెంలో గోదావరి తీరం భక్తజనంతో పోటెత్తింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక సత్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. బుధవారం మధ్యాహ్నం సమయానికి 70 వేలకు మందిపైగా స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. సత్యనారాయణ వ్రతాలు చేసుకునేందుకు జనం పోటీ పడ్డారు. ఇంకా వేల సంఖ్యలో భక్తులు క్యూలో వేచి ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement