గోదావరిలో దూకిన మహిళ | Woman jumps into Godavari | Sakshi
Sakshi News home page

గోదావరిలో దూకిన మహిళ

Jul 2 2026 4:21 AM | Updated on Jul 2 2026 4:21 AM

Woman jumps into Godavari

కాపాడి ఒడ్డుకు చేర్చిన జాలర్లు  

భద్రాచలంఅర్బన్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బ్రిడ్జి పైనుంచి ఓ మహిళ బుధవారం గోదావరిలోకి దూకింది. అదే సమయాన గోదావరిలో చేపలు పడుతున్న జాలర్లు ఆమెను రక్షించి ఒడ్డు కు చేర్చారు. అనంత రం భద్రాచలం ఏరి యా ఆస్పత్రికి తరలించారు. 

అయితే, ఆమె వివరాలు ఆరా తీయగా పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో నిర్ధారణ కాలేదు. ఆ మహిళ మతిస్థిమితం కోల్పోయిందా లేక మద్యం మత్తులో ఉందా అన్నది తేలాల్సి ఉంది. కాగా, సదరు మహిళ బ్రిడ్జిపై కాసేపు తచ్చాడి దూకే క్రమాన కొందరు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుండగా, సమీపంలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తులు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement