గోనెసంచిలో మృతదేహం | deadbody found in a bag on wednesday | Sakshi
Sakshi News home page

గోనెసంచిలో మృతదేహం

Mar 25 2015 1:04 PM | Updated on Sep 2 2017 11:22 PM

కరీంనగర్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

రామగుండం (కరీంనగర్): కరీంనగర్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రామగుండం సమీపంలో గోలివాడలో గోదావరి నది ఒడ్డున బుధవారం ఉదయం ఇది బయటపడింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎవరో హత్య చేసి మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి వదిలేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement