డీసీఎం, బైక్ ఢీ..ఇద్దరి దుర్మరణం | dcm, bike accident in sangareddy two dead | Sakshi
Sakshi News home page

డీసీఎం, బైక్ ఢీ..ఇద్దరి దుర్మరణం

Nov 22 2015 8:26 PM | Updated on Aug 25 2018 6:06 PM

మెదక్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

సంగారెడ్డి : మెదక్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. సంగారెడ్డి మండలం హనుమాన్‌నగర్ వద్ద డీసీఎం, బైక్ ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఇస్మాయిల్‌ఖాన్‌పేటకు చెందిన మోసిన్(46), రమేశ్(28) అనే ఇద్దరు మృతిచెందగా..మరొకరు గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement