అన్ని పార్టీలతో కలసి దేశవ్యాప్త ఉద్యమం

A cross country movement with all parties - Sakshi

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడి

మధిర: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందు కు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలను కలుపుకొని ఉద్య మం చేపడతానని సీఎల్పీ నేత, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. క్విడ్‌ప్రోకోలో భాగమే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఇతర పార్టీల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలకు కాంట్రాక్టులు ఇచ్చి, ప్రభుత్వ భూములు ధారాదత్తం చేస్తూ రాజకీయ వ్యభిచారానికి తెరలేపారని, ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ విషయంలో రాష్ట్రపతి, లోక్‌పాల్‌ జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. రాష్ట్రం లో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకముందే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఫిరాయింపు నేతలు సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top