ఈఎస్‌ఐ స్కామ్‌ : నిందితులకు రెండురోజుల కస్టడీ

Court Handed Over the Accused in the ESI Scam to the Custody of the ACB - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈఎస్‌ఐ నిధుల కుంభకోణం కేసులో డైరెక్టర్‌ దేవికారాణితో పాటు మరో ఆరుగురు నిందితులను రెండ్రోజుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శనివారం తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న నిందితులను ఏసీబీ ఈ నెల 9, 10వ తేదీలలో తమ కస్టడీలోకి తీసుకోనుంది. మరోవైపు ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. లైఫ్‌కేర్‌ డ్రగ్స్‌ ఎండీ సుధాకర్‌రెడ్డిని ఏసీబీ శనివారం అరెస్ట్‌ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 9. కాగా ఏసీబీ మరికొంత మందిని అరెస్ట్‌ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top