పాముకాటుతో దంపతుల మృతి | Couple die of snake bite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో దంపతుల మృతి

Aug 23 2015 9:16 AM | Updated on Jul 10 2019 7:55 PM

రాత్రి నిద్రిస్తున్న దంపతులను పాము కాటు వేయడంతో మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది.

చేర్యాల (వరంగల్ జిల్లా) : రాత్రి నిద్రిస్తున్న దంపతులను పాము కాటు వేయడంతో మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా చేర్యాల మండల కేంద్రానికి చెందిన హుస్సేన్, రహీమున్నీసా దంపతులు స్థానికంగా పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

కాగా శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వీరిని పాము కరిచింది. దీంతో మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్ తరలించారు. అయితే హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ దంపతుల్దిరూ మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement