కరోనా: సూర్యాపేటలో మరో 26 పాజిటివ్‌ | Coronavirus Positive Cases Toll Rises To 928 In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఒక్కరోజే 56 పాజిటివ్‌ కేసులు

Apr 21 2020 8:29 PM | Updated on Apr 21 2020 8:59 PM

Coronavirus Positive Cases Toll Rises To 928 In Telangana - Sakshi

తాజాగా నమోదైన కేసుల్లో సూర్యాపేటలో అత్యధికంగా 26, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 19 కేసులు నమోదయ్యాయి.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కోవిడ్‌ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 56 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 928కి చేరుకుంది. తాజాగా మరో 8 మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. దీంతో కోవిడ్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 194 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 23 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 711 గా ఉంది. ఇక తాజాగా నమోదైన కేసుల్లో సూర్యాపేటలో అత్యధికంగా 26, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 19 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 3, గద్వాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లో రెండు చొప్పున, ఖమ్మం, మేడ్చల్‌, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు చొప్పున నమోదయ్యాయి.
(చదవండి: వైద్యులకు మాస్క్‌లు,పీపీ కిట్లు ఇవ్వాలి: హైకోర్టు)


(చదవండి: హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ బేఖాతరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement