breaking news
suryapeta victims
-
కరోనా: సూర్యాపేటలో మరో 26 పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 928కి చేరుకుంది. తాజాగా మరో 8 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 194 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 23 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 711 గా ఉంది. ఇక తాజాగా నమోదైన కేసుల్లో సూర్యాపేటలో అత్యధికంగా 26, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 19 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 3, గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండు చొప్పున, ఖమ్మం, మేడ్చల్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నమోదయ్యాయి. (చదవండి: వైద్యులకు మాస్క్‌లు,పీపీ కిట్లు ఇవ్వాలి: హైకోర్టు) (చదవండి: హైదరాబాద్‌లో లాక్డౌన్ బేఖాతరు) -
కిమ్స్‌లో కోలుకుంటున్న ‘సూర్యాపేట’ బాధితులు
హైదరాబాద్: సూర్యాపేట బస్టాండ్‌లో తనిఖీల సందర్భంగా దోపిడి దొంగల కాల్పుల్లో గాయపడిన పోలీసులు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. సీఐ మొగులయ్యకు గురువారమే శస్త్ర చికిత్స నిర్వహించి శరీరంలోని రెండు బుల్లెట్లను బయటకు తీసిన సంగతి తెలిసిందే. ఐసీయూలో ఉన్న మొగులయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు శుక్రవారం వెల్లడించారు. హోం గార్డు కిశోర్‌కుమార్ కూడా కోలుకుంటున్నాడని, మాట్లాడగలుగుతున్నాడని వైద్యులు తెలిపారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి పరామర్శించారు.


