సూర్యాపేట బస్టాండ్‌లో తనిఖీల సందర్భంగా దోపిడి దొంగల కాల్పుల్లో గాయపడిన పోలీసులు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.
హైదరాబాద్: సూర్యాపేట బస్టాండ్‌లో తనిఖీల సందర్భంగా దోపిడి దొంగల కాల్పుల్లో గాయపడిన పోలీసులు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. సీఐ మొగులయ్యకు గురువారమే శస్త్ర చికిత్స నిర్వహించి శరీరంలోని రెండు బుల్లెట్లను బయటకు తీసిన సంగతి తెలిసిందే. ఐసీయూలో ఉన్న మొగులయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు శుక్రవారం వెల్లడించారు.
హోం గార్డు కిశోర్‌కుమార్ కూడా కోలుకుంటున్నాడని, మాట్లాడగలుగుతున్నాడని వైద్యులు తెలిపారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి పరామర్శించారు.


