breaking news
bus stand attack
-
బస్టాండ్‌లో దారుణం.. ప్రేమ నిరాకరించిందని బంధువు దాడి!
మంగుళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న యువతిపై ఓ వ్యక్తి మారణాయుధంతో దాడి చేసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాగా, బంట్వాల్‌లోని కేఎస్ఆర్టీసీ న్యూ బస్ స్టాండ్ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతురాలిని లావణ్యగా గుర్తించారు. ఆమె కక్కేపదవు ప్రాంతానికి చెందిన యువతిగా, కళ్లడ్కలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. లావణ్య బస్సు కోసం వేచి ఉండగా నిందితుడు ఆమె వద్దకు వచ్చాడు. అనంతరం తన బ్యాగులో నుంచి పదునైన ఆయుధాన్ని తీసి దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. దాడి నుంచి తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించినా, నిందితుడు వెంటాడి దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తీవ్ర గాయాలతో ఉన్న లావణ్యను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.A rare scene that has happened in the Mangalore region. A 21-year-old, Lavanya, was brutally hacked to death by her ex, four years after their relationship had ended. The accused, 22-year-old Chetan, who is also a distant relative, attacked her in broad daylight at a bus stop… pic.twitter.com/3wo95zZUnD— Sharanya Shettyy (@Sharanyashettyy) July 16, 2026బంధువే నిందితుడా?ఈ ఘటనలో నిందితుడిగా చేతన్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడు మృతురాలికి దూరపు బంధువని, కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లావణ్య తన ప్రేమను తిరస్కరించడంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతాయని అధికారులు తెలిపారు.ఈ దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. బంట్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక, బస్టాండ్ వంటి బహిరంగ ప్రదేశంలో జరిగిన ఈ హత్య స్థానికుల్లో భయాందోళనలు కలిగించింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో, నగరంలో మహిళల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. -
కిమ్స్‌లో కోలుకుంటున్న ‘సూర్యాపేట’ బాధితులు
హైదరాబాద్: సూర్యాపేట బస్టాండ్‌లో తనిఖీల సందర్భంగా దోపిడి దొంగల కాల్పుల్లో గాయపడిన పోలీసులు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. సీఐ మొగులయ్యకు గురువారమే శస్త్ర చికిత్స నిర్వహించి శరీరంలోని రెండు బుల్లెట్లను బయటకు తీసిన సంగతి తెలిసిందే. ఐసీయూలో ఉన్న మొగులయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు శుక్రవారం వెల్లడించారు. హోం గార్డు కిశోర్‌కుమార్ కూడా కోలుకుంటున్నాడని, మాట్లాడగలుగుతున్నాడని వైద్యులు తెలిపారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి పరామర్శించారు.


