కేసీఆర్‌ను కలిసిన కామన్వెల్త్‌ విజేతలు | CommonWealth winners meet cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను కలిసిన కామన్వెల్త్‌ విజేతలు

Apr 21 2018 2:20 PM | Updated on Aug 15 2018 9:06 PM

CommonWealth winners meet cm kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శనివారం ప్రగతిభవన్‌లో కామన్వెల్త్‌ గేమ్స్‌ 2018 విజేతలు కలిశారు. ఈ సందర్భంగా కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని కేసీఆర్‌ అభినందించారు. క్రీడాకారులతో పాటు బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ను కూడా కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. కామన్వెల్త్‌లో తెలంగాణకు చెందిన వారు మెడల్స్‌ సాధించడంపై కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ర్టానికి, దేశానికి మంచి గౌరవం తీసుకువచ్చారన్నారు. భవిష్యత్‌లో మరెన్నో విజయాలు సాధించాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆకాంక్షించారు.

అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం వెల్లడించారు. కాగా, ఈ నెల 23న కామన్వెల్త్ విజేతలకు ఎల్బీ స్టేడియంలో సన్మానం, అభినందన సభ నిర్వహించనున్నారు. సీఎంను కలిసిన వారిలో సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, శ్రీకాంత్‌, పుల్లెల గోపిచంద్‌ పాటు పలువురు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement