ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య | Committed suicide by hanging | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య

Apr 5 2018 8:52 AM | Updated on Apr 5 2018 8:52 AM

Committed suicide by hanging - Sakshi

మృతిచెందిన స్వాతి

నర్సంపేటరూరల్‌ : ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్సంపేట పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... పట్టణంలోని బజ్జు భద్రయ్య కుమారుడు కిషన్‌కు పాలకుర్తికి చెందిన బొగ్గరావు శ్రీనివాస్‌ కుమార్తె స్వాతి (27)తో గత 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి పాప కూడా ఉంది. కిషన్‌ పట్టణంలో ఓ బుక్‌స్టోర్‌ షాపును నడిపిస్తున్నాడు. స్వాతి చెన్నారావుపేట మండలంలోని ముగ్దుంపురం శివారులోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తుంది. ఉదయం పాపను స్కూల్‌కు పంపించి వచ్చి కిషన్‌ షాపుకు వెళ్లాడు. తిరి మధ్యాహ్నం ఇంట్లోకి వెళ్లి చూసే సరికి ఉరి వేసుకుని కనిపించింది. దీంతో చుట్టు పక్కల వారి సాయంతో 108లో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. దీనిపై స్థానిక పోలీసులను వివరణ కోరగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement