సాక్షి భువనగిరి: ఈ రోజుల్లో వివాహనికి చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పెళ్లిళ్లలో తమ తాహతుని చూపించాలని అరాటపడుతూ రూ. లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. అదే కెరీర్‌లో బాగా సెటిలైన వారయితే ఆ మ్యారేజ్ హంగామా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అయితే దేశంలోనే ఎంతో పేరొందిన సివిల్స్ సర్వీస్‌కు ఎంపికైన అధికారుల జంట సాదాసీదాగా రిజిష్టర్ మ్యారేజ్ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.
చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారిని శేషాద్రిని రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి ఎలాంటి ఆడంబరం లేకుండా రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఈ ఆదర్శ వివాహనికి అధికారులు హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వధువు శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా ఉండగా, వరుడు శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ ట్రైనింగ్‌లో ఉన్నారు.


